బాలయ్య ఆ సాంగ్ రీమిక్స్ చెయ్యట్లేదు !

Published on Mar 3, 2020 9:17 am IST

నటసింహం బాలయ్య హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ నిన్న రామోజీ ఫిల్మ్ సిటీలో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ పర్యవేక్షణలో యాక్షన్ ఎపిసోడ్ తో మొదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం కోసం బాలయ్య తన పాత చిత్రం ‘బంగారు బుల్లోడు’ చిత్రంలోని వాన పాట ‘స్వాతిలో ముత్యమంత’ పాటను రీమిక్స్ చేయబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఫ్యాన్స్ కూడా ఇది నిజమే అనుకున్నారు. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇప్పటికే ఒక హీరోయిన్ గా అంజలిని ఫైనల్ చేసింది టీం. అలాగే శ్రియా సరన్ ను ఓ కీలక పాత్ర కోసం తీసుకోవాలనుకుంటున్నారట. మొత్తానికి బాలయ్య జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ ప్రటినాయకుడి పాత్ర చేయనున్నారని సమాచారం. ఇకపోతే ఈ యేడాది వేసవికి సినిమా విడుదలకానుంది. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More