నయనతార హీరోయిన్, దసరా కానుకగా బాలకృష్ణ 99వ సినిమా.!

balakrishna-nayana-thara
నందమూరి బాలకృష్ణ అటు ప్రజా నాయకుడిగా, ఇటు అభిమానులు మెచ్చే కథానాయకుడిగా బిజీ బిజీ గా ఉన్నాడు. తనను అభిమానించే అభిమానుల కోసం కూడా సినిమాలకు బ్రేక్ ఇవ్వకుండా వరుసగా క్రేజీ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ 98వ సినిమా ‘లయన్’ షూటింగ్ ని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాని మార్చి చివర్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది పూర్తి కాకముందే ఆతన తన తన 99వ సినిమాని సెట్స్ పిక్ ఐ తీసుకెళ్ళే పనిలో ఉన్నాడు.

కోన వెంకట్ – గోపి మోహన్ లు కలిసి రాసిన కథ అందించిన ఈ సినిమాకి శ్రీ వాస్ దర్శకత్వం వహించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నయనతారని హీరోయిన్ గా సెలెక్ట్ చేసారు. గతంలో బాలకృష్ణ – నయనతార కాంబినేషన్ లో వచ్చిన ‘సింహా’, ‘శ్రీ రామరాజ్యం’ పెద్ద హిట్ అయ్యాయి. వీరిద్దరి జోడీలో రానున్న మూడవ సినిమా ఇది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్ర్రారంభించి దసరా కానుకగా ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాని హైదరబాద్, ఢిల్లీ, యూరప్ లలో కంటిన్యూగా షూట్ చేయనున్నారు. ఇండియాలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ఈరోస్ ఇంటర్నేషనల్ వారు, డైరెక్టర్ శ్రీవాస్ కలిసి నిర్మించనున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించాడు. ప్రస్తుతం ఈ సినిమాకి ‘డిక్టేటర్’ అనే టైటిల్ ని ఖరారు చేసే పనిలో ఉన్నాడు.

Exit mobile version