గ్యాంగ్ స్టర్ గా మారే పోలీస్ గా బాలయ్య.

Published on Jun 22, 2019 1:06 pm IST

సీనియర్ దర్శకుడు కె.ఎస్ రవికుమార్ డైరెక్షన్ లో నట సింహం బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న మూవీ ఇటీవలే అధికారికంగా ప్రారంభమైంది. ఎప్పుడో చిత్రీకరణ ప్రారంభించాల్సివుండగా కథా విషయంలో జరిగిన మార్పుల కారణంగా ఆలస్యమైంది. ఐతే ఈచిత్రం కథా,కథనాల విషయంలో అనేక ఊహాగానాలు పరిశ్రమలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఇది ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ఆధారంగా నిర్మిస్తున్నఓ పొలిటికల్ డ్రామా అని ప్రచారం జరుగుతుంది.

ఐతే అభిమానుల అనుమానాలకు, ఆతృతకు తెరదించుతూ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న సి.కళ్యాణ్ కథపై ఓ క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ మాస్ అంశాలతో కూడిన పూర్తి స్థాయి కమర్షియల్ చిత్రమట. బాలయ్య పోలీస్ ఆఫీసర్ గా, గ్యాంగ్ స్టర్ గా రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారట. పోలీస్ గా ఉన్న బాలయ్య గ్యాంగ్ స్టర్ గా ఎందుకు మారాడు అనేదే మూవీలోని అసలు కథ అని తెలిపారు. బాలయ్య గతంలో పోలీస్ గా నటించిన చిత్రాలు మంచి విజయం సాధించాయి, మరోసారి బాలయ్య ఆ సెంటిమెంట్ రిపీట్ చేస్తారని అభిమానులు ఆనందపడుతున్నారట.

సంబంధిత సమాచారం :

More