అభిమానుల కోసం స్పెషల్ గిఫ్ట్ రెడీ చేసిన బాలకృష్ణ.

అభిమానుల కోసం స్పెషల్ గిఫ్ట్ రెడీ చేసిన బాలకృష్ణ.

Published on Dec 17, 2014 8:26 AM IST

balakrishna
అభిమానులకు నూతన సంవత్సరంలో గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు నందమూరి నట సింహం బాలకృష్ణ. డిసెంబర్ 31 అర్ధరాత్రి సత్యదేవ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమా టీజర్ ను విడుదల చేయనున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

త్రిష మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ‘లెజెండ్’ తర్వాత మరోసారి బాలయ్యతో జోడి రాధిక ఆప్టే కట్టింది. దర్శకుడి ఆఫీసు వచ్చిన సమాచారం ప్రకారం ఈ టీజర్ అభిమానులకు పండుగ తీసుకొచ్చేలా ఉంటుందని చెప్తున్నారు.

మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్నారు. 2015లో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు