వైజాగ్ లో ‘ఫిల్మ్ సిటీ’ కట్టబోతున్న బాలకృష్ణ !

వైజాగ్ లో ‘ఫిల్మ్ సిటీ’ కట్టబోతున్న బాలకృష్ణ !

Published on Jun 18, 2018 5:17 PM IST

Balakrishna2

నందమూరి బాలకృష్ణ నవ్యాంధ్రప్రదేశ్ లో కూడా సినీనిర్మాణం జరగాలనే ఉద్దేశ్యంతో వైజాగ్ లో ఫిల్మ్ సిటీ కట్టాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఫిల్మ్ సిటీ నిర్మాణానికి అనువైన ఖాళీ స్థలం కోరుతూ అప్లికేషన్ పెట్టారట. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టెలివిజన్, థియేటర్ అభివృద్ది సంస్థ అధ్యక్షుడు మరియు అంబికా గ్రూపు సంస్థల అధ్యక్షుడైనా అంబికా క్రిష్ణ మీడియాతో ముచ్చటిస్తున్న సందర్భంలో ఓ ప్రశ్నకు బదులుగా బాలయ్య ఫిల్మ్ సిటీ నిర్మాణం చేపట్టడానికి ల్యాండ్ కోసం పత్రాలు సమర్పించారని వెల్లడించారు.

అయితే బాలకృష్ణనే కాకుండా మోహన్ బాబు కూడా ఫిల్మ్ సిటీ నిర్మాణానికి ల్యాండ్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారని అంబికా క్రిష్ణ చెప్పారు. బాలకృష్ణ ఫిల్మ్ సిటీ నే కాకుండా అమరావతిలో ‘బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్’ నిర్మాణ పనులను త్వరలో చేపట్టనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటిస్తున్నారు.

తాజా వార్తలు