బోయపాటి సినిమాలో కొత్తగా.. !

Published on Dec 2, 2019 9:22 pm IST

నందమూరి బాలకృష్ణ ఇక నుండి తానూ చేసే సినిమా కథల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోబోతున్నారట. ఈ సారి నుండి అన్ని వర్గాల ప్రేక్షుకులను దృష్టిలో పెట్టుకుని బాలయ్య సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడట. తన సినిమాల్లో కొత్తదనం ఖచ్చితంగా ఉండాలని బాలయ్య పట్టుబడుతున్నారట. ప్రస్తుతం బాలయ్య కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ‘రూలర్’ సినిమాని కంప్లీట్ చేశారు.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో డిసెంబర్ నెలలోనే కొత్త సినిమాను స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమాలో ‘సింహ, లెజెండ్’ చిత్రాల మాదిరిగా మాస్ అండ్ యాంగ్రీ హీరోగానే కాకుండా ఇంకాస్త కొత్తగా కనిపించాలని బాలయ్య బలంగా కోరుకుంటున్నారట. బాలయ్య ఆదేశాల మేరకు పాత్రలో వైవిధ్యంతో పాటు, కొత్త తరహా కథను సిద్దం చేశారట బోయపాటి. మొత్తానికి బోయపాటి సినిమాలో బాలయ్య కొత్తగా కనిపించబోతున్నాడు అన్నమాట.

సంబంధిత సమాచారం :

X
More