భీమిలి రోడ్డులో ఫిల్మ్ స్టూడియో కట్టబోతున్న బాలయ్య !
Published on Aug 23, 2018 2:50 am IST

నందమూరి బాలకృష్ణ నవ్యాంధ్రప్రదేశ్ లో కూడా సినీనిర్మాణం జరగాలనే ఉద్దేశ్యంతో వైజాగ్ లో ఫిల్మ్ సిటీ కట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే వైజాగ్ లోని భీమిలి రోడ్డు ప్రాంతంలో ఫిల్మ్ సిటీ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన 316 ఎకరాల్లో ఫిల్మ్ సిటీస్ కట్టేందకుకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోంది. ఇందుకుగాను ఎకరం 50 లక్షలుగా కేటాయించిందని, ఈ రేటు తగ్గించే సూచనలు కూడా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టెలివిజన్, థియేటర్ అభివృద్ది సంస్థ అధ్యక్షుడు మరియు అంబికా గ్రూపు సంస్థల అధ్యక్షుడైనా అంబికా క్రిష్ణ మీడియాతో ముచ్చటిస్తున్న సందర్భంలో చెప్పారు. అలాగే బాలయ్య ఫిల్మ్ సిటీ నిర్మాణం చేపట్టనున్నారని వెల్లడించారు.

అయితే బాలకృష్ణనే కాకుండా ఏవిఎం సంస్థ కూడా ఫిల్మ్ సిటీ నిర్మాణానికి ల్యాండ్ కోరారని అంబికా క్రిష్ణ చెప్పారు. బాలకృష్ణ ఫిల్మ్ సిటీ నే కాకుండా అమరావతిలో ‘బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్’ నిర్మాణ పనులను త్వరలో చేపట్టనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook