బాలయ్య మోస్ట్ అవైటెడ్ సినిమా టైటిల్ రివీల్ అప్పుడేనా..?

Published on Mar 21, 2021 11:09 am IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తన ఆల్ టైం మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ మాసివ్ ప్రాజెక్టు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రంపై నందమూరి అభిమానుల్లో భారీ హైప్ కూడా నెలకొన్న సంగతి తెలిసిందే. మరి గత కొన్నాళ్లుగా మంచి మోస్ట్ అవైటెడ్ గా ఉన్న ఈ ప్రాజెక్ట్ పై సస్పెన్స్ గా ఉన్నది టైటిల్ విషయంలోనే..

ఫైనల్ గా సినిమా రిలీజ్ కూడా వచ్చేసిన ఈ చిత్రం టైటిల్ మాత్రం ఇంకా రివీల్ కాలేదు. మరి ఇది ఎప్పుడు రివీల్ అవుతుందో అన్నదానిపై బజ్ వినిపిస్తోంది. దాని ప్రకారం ఈ చిత్రం తాలూకా పవర్ ఫుల్ టైటిల్ ను వచ్చే ఉగాది కానుకగా విడుదల చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. మరి ఇది ఎంత వరకు నిజమో వేచి చూడాలి. ఇక ఈ భారీ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ ఎలెక్ట్రిఫయింగ్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :