పుట్టినరోజుకే ‘బాలయ్య’ నుండి కొత్త ప్రకటన ?

Published on Apr 23, 2020 3:00 am IST

బాలయ్య బాబు – బి.గోపాల్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ఇప్పటికే పూర్తి చేసుకుందట. కాగా ఈ ప్రాజెక్ట్ జూన్ 10న బాలయ్య పుట్టినరోజున నాడు అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. కరోనా తగ్గిన వెంటనే షూటింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట.

ఇక ‘బాలయ్య – గోపాల్’లది సూపర్ హిట్ కాంబినేషన్. బాలయ్య కెరీర్లోనే సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచిన ‘సమరసింహారెడ్డి, నరసింహనాయుడు’ సినిమాలు బి గోపాల్ డైరెక్ట్ చేసినవే. ఇక ప్రెజెంట్ ఫామ్ లో ఉన్న టాప్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ సినిమా కోసం ఫుల్ స్క్రిప్ట్ రాస్తున్నారు. మరి చూడాలి ఈ సూపర్ హిట్ కాంబో మళ్లీ సక్సెస్ అవుతుందో లేదో.

కాగా బాలయ్య మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే పూరితో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :