ప్లాప్స్ దెబ్బకి ‘బాలయ్య బాబు’ ఈ సారి… ?

Published on Feb 21, 2020 12:00 am IST

టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు వందల కోట్లు కలెక్ట్ చేస్తుంటే.. బాలయ్య సినిమాలు మాత్రం ఈ మధ్య గట్టిగా ముప్పై కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయాయి. ప్లాప్ టాక్ రావడం వల్లే బాలయ్య సినిమాలకు కలెక్షన్స్ రావడం లేదు అనుకున్నా… ఆయన హిట్ సినిమాలు సైతం ఇంతవరకూ వంద కోట్ల మార్క్ ను అందుకోలేదు. పైగా బాలయ్య చిత్రాలు ఈ మధ్య వరుసగా ప్లాప్ లు అవుతున్నాయి. అయితే, ఇలా వరుసగా ప్లాప్ లు ఇవ్వడం బాలయ్యకు కొత్తేమి కాదు, ‘సింహా’ ముందువరకూ బాలయ్య సినిమాల ప్లాప్ ల పరంపర గుర్తు ఉంది కదా. కానీ, ఆ తరువాత ‘సింహా’ క్రియేట్ చేసిన రికార్డ్స్ సౌండ్ ఇంకా బాలయ్య ఫ్యాన్స్ గుండెల్లో మోగుతూనే ఉంది.

మళ్లీ ఇప్పుడు బాలకృష్ణకు అలాంటి సాలిడ్ హిట్ కావాలి. అలాంటి హిట్ కొట్టాలనే కసితోనే బాలయ్య జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఈ నెల 26 నుండి షూటింగ్ కి వెళ్లబోతుంది. ఈ సినిమాలో బాలయ్య బాబు కొన్ని సన్నివేశాల్లో పూర్తి ఆధ్యాత్మిక వేత్తగా కనిపించబోతున్నాడట. ఆధ్యాత్మికతతో మొదలైయ్యే బాలయ్య పాత్ర చాల వైవిధ్యంగా అలాగే ప్రేరణాత్మకంగా ఉండబోతుందట. ఇక సినిమాలో యాక్షన్ చాల సహజంగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి బాలయ్య బాబు ప్లాప్స్ దెబ్బకి ఈ సారి కొత్తగా ట్రై చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More