‘బాలయ్య’ ఫ్యాన్స్ కు బర్త్ డే స్పెషల్ ఫిక్స్ !

Published on May 31, 2020 1:02 am IST

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా ఓ సినిమా రాబోతుంది. అయితే జూన్ 10న బాలయ్య పుట్టినరోజు.. మరి బర్త్ డే స్పెషల్ గా బాలయ్య ఈ ప్రాజెక్ట్ నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తారా ? లేదా ? అని బాలయ్య ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా నందమూరి ఫ్యాన్స్ కు బాలయ్య కానుక ఇవ్వనున్నారు. పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న ఫస్ట్‌ లుక్‌ విడుదల చేయనున్నారు.

ఇక ఈ సినిమా గురించి ఇప్పటికే అనేక రకాలుగా చాల రూమర్స్ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. మొత్తానికి బాలయ్య జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More