బాలయ్య ఇంకా క్లారిటీ ఇవ్వలేదట !

బాలయ్య ఇంకా క్లారిటీ ఇవ్వలేదట !

Published on Jun 2, 2019 12:46 PM IST

మొత్తానికి నందమూరి బాలకృష్ణ సూచన మేరకు బోయపాటి శ్రీను స్క్రిప్ట్ పనులను పూర్తి చేశాడు. కానీ వీరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడో ఉంటుందో ఇప్పట్లో క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదు. ఎప్పుడో మొదలవ్వాల్సిన సినిమా హై బడ్జెట్ కారణంగా పోస్ట్ ఫోన్ అయింది. చివరికి 60 కోట్లు బడ్జెట్ ను బోయపాటి 40 కోట్లకు కుదించినా సినిమా ఎప్పుడు ఉంటుందో ఇంకా తెలియని పరిస్థితి.

అయితే బాలయ్య సూచన మేరకు బోయపాటి కథలో మార్పులు చేసాడట. స్క్రిప్ట్ లో చేసిన మార్పులు గురించి ఇప్పటికే బాలయ్యకి కూడా వినిపించినట్లు తెలుస్తోంది. బాలయ్యకి కూడా లేటెస్ట్ వర్షన్ బాగా నచ్చిందట. ముఖ్యంగా సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపిస్తారని.. అందులో ఒక పాత్ర కొంత వైవిధ్యంగా ఉంటుందని సమాచారం. మరి సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి. ఇక ఈ కాంబినేషన్ ఈ సారి హిట్ అవుతుందో లేదో చూడాలి. హిట్ అయితే మాత్రం బాలయ్య – బోయపాటి హ్యాట్రిక్ హిట్ కొట్టినట్లే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు