డెడ్ లైన్ పెట్టేసిన బాలయ్య ‘దాదా’!

డెడ్ లైన్ పెట్టేసిన బాలయ్య ‘దాదా’!

Published on Nov 21, 2026 5:01 PM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోస్ సాలిడ్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల్లో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ దాదా కూడా ఒకటి. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాని దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నారు.

అయితే మధ్యలో బాలయ్యకి జరిగిన గాయం కారణంగా సినిమా ఆలస్యం అవుతుంది అని చాలామంది అనుకున్నారు కానీ ఈ సినిమాని మాత్రం మేకర్స్ క్రిస్మస్ కానుకగా విడుదలకి తెస్తున్నట్టు ఖరారు చేశారు. అయితే షూట్ ఆలస్యం అయినప్పటికీ దాదా డెడ్ లైన్ పెట్టేసినట్టు తెలుస్తుంది.

దాదా సినిమాని డిసెంబర్ మొదటి వారానికి పూర్తి చేసేస్తారట. ఇక అక్కడ నుంచి 24 కి ఉన్న గ్యాప్ లో మిగతా పనులు పూర్తి చేస్తారని తెలుస్తుంది. సో మొత్తానికి దాదా విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్లు అక్కర్లేదని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు