ఊహించని ప్రశ్నలతో బాలయ్య ఫస్ట్ ఎవర్ షో ప్రోమో.!

Published on Oct 31, 2021 12:55 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన “అఖండ” చిత్రం పూర్తయ్యాక మొట్టమొదటి సారిగా తానే స్వయంగా ఓ షోకి హోస్ట్ గా సైన్ చేసిన సంగతి తెలిసిందే. అదే “అన్ స్టాప్పబుల్”. మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ “ఆహా” లో ప్లాన్ చేసిన ఈ టాక్ షో కోసం అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇప్పుడు షో మేకర్స్ ఈ అవైటెడ్ ప్రోమోని రిలీజ్ చేశారు.

మరి ఈ మొట్టమొదటి ఎపిసోడ్ కి డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు అండ్ ఫ్యామిలీ వస్తున్నారన్న టాక్ నిజం చేస్తూ మోహన్ బాబునే బాలయ్య షో మొదటి ఎపిసోడ్ అతిధిగా వచ్చారు. మరి మోహన్ బాబు బాలయ్య ల సాన్నిహిత్యం కోసం అందరికీ తెలిసిందే. దీనితో అన్ని కోణాలు కూడా ఈ ఈ ప్రోమోలో మేకర్స్ దట్టించారు. సినిమాల నుంచి ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేసుకొని వారి పర్సనల్ లైఫ్ పాలిటిక్స్ ప్రశ్నలు కూడా ఇందులో కనిపించాయి.

దీనితో ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ తోనే మంచి రసవత్తరంగా ప్రామిసింగ్ గా అనిపిస్తుంది. అలాగే మరోపక్క ఇందులోనే మోహన్ బాబు తో పాటుగా కొత్త మా ప్రెసిండెంట్ మరియు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు అలాగే కూతురు మంచు లక్ష్మి కూడా వచ్చారు. మొత్తానికి మాత్రం ఈ ప్రోమో అదిరిపోయింది. బాలయ్య లాస్ట్ లో చెప్పిన డైలాగ్ మరీ అదిరిపోయింది. మరి ఈ ఫుల్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే వచ్చే నవంబర్ 4 వరకు ఆగక తప్పదు.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :