నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఇప్పుడు అవైటెడ్ సీక్వెల్ “అఖండ 2” చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా పక్కన పెడితే బాలయ్య మరో భారీ సీక్వెల్ జైలర్ 2 లో కూడా గెస్ట్ రోల్ గా చేయనున్నారు అని టాక్ ఉంది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో వచ్చిన జైలర్ చిత్రం బ్లాస్టింగ్ బ్లాక్ బస్టర్ అయ్యింది.
మరి ఇప్పుడు సీక్వెల్ లో బాలయ్య కూడా ఉన్నారనే టాక్ మరింత హైప్ తీసుకురాగా ఫైనల్ గా ఓ సాలిడ్ బజ్ వినిపిస్తోంది. బాలయ్య ఏకంగా జైలర్ 2 కోసం 20 రోజులు కాల్షీట్స్ ఇచ్చినట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. అంటే సినిమాలో బాలయ్య ఎంతసేపు కనిపిస్తారో అర్ధం చేసుకోవచ్చు. ఇక దీనిలో ఎంతవరకు నిజం ఉందో వేచి చూడాలి.