మాస్ లుక్ లో రచ్చ లేపిన బాలయ్య

మాస్ లుక్ లో రచ్చ లేపిన బాలయ్య

Published on Dec 6, 2014 11:05 AM IST

balakrishna
తన అభిమానులు చాలా సంవత్సరాలుగా తపించిపోతున్న అచ్చమైన మాస్ లుక్ లో బాలకృష్ణ తన 98వ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశాడు. సత్యదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రంగుల కళ్ళద్దాలు, గళ్ళ లుంగీ తో మాస్ బాలయ్య అలరించాడు

ఈ సినిమాకు గాడ్సే, లయన్, వారియర్ సినిమా టైటిళ్ళు పరిశీలనలో వున్నాయి. సింహా, లెజెండ్ ల సినిమాల లానే ఈ చిత్రంలో కూడా బాలయ్య ద్విపాత్రాభినయం చేయనున్నారు. త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్స్

సంబంధిత సమాచారం

తాజా వార్తలు