మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో బాలయ్య బయోపిక్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ తనయుడుగా నందమూరి బాలకృష్ణ అందరికీ తెలుసు. మరి ఎన్టీఆర్ గా ఎలా ఉంటారో అని ఇన్నాళ్లు ప్రేక్షకుల ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కాగా ఎన్టీఆర్ గెటప్ లో బాలయ్య ఉన్న లుక్ ఈ సాయంత్రం విడుదల చేసింది చిత్రబృందం. మనదేశం చిత్రంలోని ఎన్టీఆర్ లుక్ లో బాలయ్య బాగున్నారు. ముఖ్యంగా ఖాకీ దుస్తులు టోపీతో ఆయన ఎన్టీఆర్ ని గుర్తుకు తెస్తున్నారు.
ఐతే ఎన్టీఆర్ గా బాలయ్యను చూసిన నందమూరి అభిమానులు ఆ పోస్టర్ ను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. వచ్చే ఏడాది జనవరి 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్రయత్నిస్తోంది.


