మాస్ స్టెప్స్ వేస్తోన్న బాలయ్య ?

Published on Jan 23, 2021 9:03 pm IST

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా రాబోతున్న సినిమా ప్రస్తుతం సారధి స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ఈ షూట్ లో బాలయ్య – ప్రగ్యా జైస్వాల్ పై సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగ్ లో బాలయ్య మాస్ స్టెప్స్ కూడా వేయబోతున్నాడట. ఇక ఈ సినిమాలో మరొక ప్రముఖ నటుడు శ్రీకాంత్ ఇందులో నెగెటివ్ రోల్ చేస్తుండగా ప్రధాన ప్రతినాయకుడు ఎవరనేది ఇంకా బయటపెట్టలేదు టీమ్.

ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా సంగీత దర్శకుడు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. బాలయ్య కూడా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం :

More