కలెక్టర్ తో బాలయ్య లవ్ స్టోరీ.. కొత్త కాంబినేషన్ !

Published on Mar 29, 2021 8:37 am IST

బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో రానున్న సినిమాలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆమె పాత్ర పై ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఆమె యంగ్ కలెక్టర్ పాత్రలో కనిపిస్తుందని.. బాలయ్య పాత్ర చేసే మంచి పనులు చూసి తాను కలెక్టర్ అయినప్పటికీ లవ్ లో పడుతుందట. మరి ప్రగ్య, బాలయ్యతో లవ్ స్టోరీ అంటే ఎలా ఉంటుందో చూడాలి. బాలయ్య – ప్రగ్య జోడి పై కూడా అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి.

ఇక నటసింహం బాలయ్య బాబు సినిమాలకు కథ పవర్ ఫుల్ గా ఉన్నా లేకపోయినా, సినిమా టైటిల్స్ మాత్రం పవర్ ఫుల్ గా ఉంటాయి. అందులో బోయపాటి, బాలయ్య సినిమా అంటే కచ్చితంగా అదిరిపోయే టైటిల్ ఉండాలి. అందుకే గాడ్అ ఫాదర్ లాంటి టైటిల్ ను పెట్టాలనుకుంటున్నారు. ఇక ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇక బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించాడు, మరి ఈ సారి బాలయ్యకు బోయపాటి హిట్ ఇస్తాడో..లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :