‘క్రాక్’ డైరెక్టర్ కథ నచ్చిందట !

‘క్రాక్’ డైరెక్టర్ కథ నచ్చిందట !

Published on Mar 6, 2021 9:02 PM IST

‘మాస్ మహారాజా’ రవితేజ క్రాక్ కి ముందు గత ఏడు సినిమాలుగా సక్సెస్ లేదు. అలాంటి ప్లాప్ ల వలయంలో నలిగిపోతున్న రవితేజకు ‘క్రాక్’ అంటూ మంచి సాలిడ్ హిట్ ఇచ్చాడు ‘గోపీచంద్ మ‌లినేని’. ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్స్ సాధించి మొత్తానికి రవితేజ కెరీర్ లోనే ‘క్రాక్’ కేక అనిపించుకుంది. అందుకే, గోపీచంద్ కి ఇప్పుడు వరుస అవకాశాలు వస్తున్నాయి. వాటిల్లో ముఖ్యమైనది బాలయ్యతో సినిమా.

ఇప్పటికే వీరి కలయికలో సినిమా అంటూ అనేక రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. వాటిల్లో నిజానిజాలు ఎంతన్నది పక్కన పెడితే.. బాలయ్య బాబుకు సరిపోయే కథను గోపీచంద్ తాజాగా బాలయ్యకు చెప్పినట్లు తెలుస్తోంది. పల్నాటి ప్రాంతానికి చెందిన ఓ చరిత్రకారుడి కథ ఆధారంగా గోపీచంద్ బాలయ్యకు కథ చెప్పాడట. కథ బాలయ్యకి నచ్చిందట.

కాగా సమ్మర్ తరువాత నుండి వీరి సినిమా సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం. అయితే ఇందులో ఎంత నిజం ఉందనేది అధికారిక ప్రకటన వచ్చేవరకూ ఆగాల్సిందే. ఒక్కటి మాత్రం నిజం బాలయ్యతో గోపీచంద్ సినిమా ఉండబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు