బాలయ్య మేనియా..”అఖండ” కి సాలిడ్ బుకింగ్స్.!

Published on Nov 25, 2021 3:00 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ సినిమా “అఖండ”. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా రిలీజ్ కోసం ఎప్పుడు నుంచో నందమూరి అభిమానులు సహా మాస్ ఆడియెన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి ఎట్టకేలకు ఈ సినిమా బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే మన దగ్గర కాదు కానీ ఓవర్సీస్ లో బాలయ్య మేనియా క్లియర్ గా కనిపిస్తుంది. ఓవర్సీస్ లో ఆల్రెడీ ఈ సినిమా బుకింగ్స్ లక్ష డాలర్స్ కి పైగా ప్రీ సేల్స్ లో బుకింగ్ జరుపుకుంది అట.

దీని బట్టి ఓవర్సీస్ ఆడియెన్స్ కూడా మాస్ బాలయ్య కోసం ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :