జులై నుండి బాలయ్య కొత్త సినిమా !

Published on May 16, 2021 3:00 am IST

‘డాన్ శీను, బలుపు, పండగ చేస్కో’ లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ మలినేని ‘క్రాక్’ సినిమాతో కమర్షియల్ దర్శకుడిగా స్థిరపడిపోయారు. రవితేజ హీరోగా రూపొందిన ఈ చిత్రం పక్కా మాస్ ఎంటర్టైనర్ గా మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్స్ సాధిస్తూ మొత్తానికి ‘క్రాక్’ కేక అనిపించుకుంది.

దాంతో బాలయ్యతో త్వరగా సినిమా ఫిక్స్ అయింది. బాలయ్య బాబుకు సరిపోయే కథ గోపీచంద్ తాజాగా చెప్పినట్లు తెలుస్తోంది. పల్నాటి ప్రాంతానికి చెందిన ఓ చరిత్రకారుడి కథ ఆధారంగా గోపీచంద్ బాలయ్యకు కథ చెప్పాడట. జులై నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న బాలయ్య జులై కల్లా అఖండను పూర్తి చేయనున్నాడు.

సంబంధిత సమాచారం :