జగన్ తో భేటీకి బాలయ్య ఏమన్నాడంటే..!

జగన్ తో భేటీకి బాలయ్య ఏమన్నాడంటే..!

Published on Jun 6, 2020 10:29 AM IST

చిత్ర పరిశ్రమ అభివృద్ధి విషయమై తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులతో సినీ ప్రముఖులు సమావేశం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిరంజీవి అధ్యక్షతన కొందరు పెద్దలు తెలంగాణా సీఎం కేసీఆర్ ని కలవడం జరిగింది. ఇక ఈ నెల 9న చిత్ర ప్రముఖులు ఆంద్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలువనున్నారు. ఈ సమావేశానికి బాలకృష్ణను పిలువగా ఆయన రాలేనని చెప్పినట్లు సమాచారం అందుతుంది.

సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈనెల 10న బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఉన్నాయి. ఆయన కుటుంబ సభ్యులు, ప్రముఖుల సమక్షంలో షష్ఠి పూర్తి జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి రాలేనని చెప్పినట్లు చెప్పారు. గతంలో జరిగిన కొన్ని సమావేశాలకు బాలయ్యను పిలవని కారణంగా ఆయన అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు