సర్గీయ ఎన్టీఆర్ కి బాలయ్య నివాళి..!

Published on May 28, 2020 9:19 am IST

నేడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 97వ జయంతి సంధర్భంగా ఆయన కుమారుడు బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ సందర్శించారు. భార్య వసుంధర దేవితో పాటు ఘాట్ చేరుకున్న ఆయన తండ్రి సమాధి పై పుష్పాలు ఉంచి నివాళి అర్పించారు. ఎన్టీఆర్ సమాధి వద్ద బాలయ్య కొద్ది నిముషాలు తండ్రి జ్ఞాపకాలలో మునిగిపోయారు.

హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎన్టీఆర్ ఘాట్ కి రావాల్సి ఉండగా, లాక్ డౌన్ నిబంధనలను గౌరవిస్తూ ఆయన ఇంటిలోనే తాత ఎన్టీఆర్ కి నివాళులు తెలిపినట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ తాత గారిని తలచుకుంటూ ఓ భావోద్వేగ ట్వీట్ చేశారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ సైతం ఎన్టీఆర్ ఘాట్ సందర్శించలేదు.

సంబంధిత సమాచారం :

More