‘భగవంత్ కేసరి’ రీమేక్ లో బాలయ్య రిఫరెన్స్.. థియేటర్స్ బ్లాస్ట్!

‘భగవంత్ కేసరి’ రీమేక్ లో బాలయ్య రిఫరెన్స్.. థియేటర్స్ బ్లాస్ట్!

Published on Jul 23, 2026 3:50 PM IST

నట సింహం బాలకృష్ణ హీరోగా ‘అఖండ’తో మాస్ కంబ్యాక్ ఇచ్చిన తర్వాత బాలయ్య చేసిన సినిమాల్లో దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో చేసిన చిత్రం ‘భగవంత్ కేసరి’ ఎలాంటి హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని తమిళ్ లో దర్శకుడు హెచ్ వినోద్ దళపతి విజయ్ హీరోగా జన నాయకుడు పేరిట రీమేక్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

ఎన్నో అడ్డంకులు తర్వాత వచ్చిన ఈ సినిమాలో బాలయ్య ఫ్యాన్స్ కి కూడా మేకర్స్ ట్రీట్ ఇచ్చారు. బాలయ్య సినిమా రీమేక్ చేసి అందులో బాలయ్య రిఫరెన్స్ అది కూడా బాలయ్య క్వాలిటీ ప్రాజెక్ట్ డాకు మహారాజ్ లోని ఎలివేషన్ సీన్ రిఫరెన్స్ పెట్టడం అనేది నందమూరి అభిమానుల్లో క్రేజీగా మారింది.

దీనితో సోషల్ మీడియాలో ఆల్రెడీ ఆ విజువల్స్ కూడా వైరల్ గా మారాయి. ఇంకోపక్క సీఎం స్థాయి వ్యక్తి బాలయ్య రిఫరెన్స్ ని తన సినిమాలో పెట్టుకోవడం ఆనందంగా ఉందని అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు