‘అఖండ’గా అదరగొట్టిన బాలయ్య !

Published on Apr 13, 2021 2:33 pm IST

నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమా నుండి టైటిల్ తో పాటు బాలయ్య ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. కాగా అఖండ టైటిల్ తో వచ్చిన ఈ పోస్టర్ లో బాలయ్య అఘోర పాత్రలో రౌద్రంగా కనిపించాడు. ఇక ఈ పాత్రకు సినిమాలో డైలాగ్ లు పెద్దగా ఉండవట. అలాగే ఆధ్యాత్మికతతో ఈ అఘోర పాత్ర చాల వైవిధ్యంగా అలాగే ప్రేరణాత్మకంగా ఉండబోతుందట.

ఇక బాలయ్య ఈ సినిమాలో తన స్టైల్ ను పూర్తిగా మార్చాలనుకుంటున్నాడట. ముఖ్యంగా తానూ చేసే యాక్షన్ విషయంలో బాలయ్య మార్పు చూపించాలనుకుంటున్నాడట. మొత్తానికి బాలయ్య అభిరుచికి తగ్గట్లు యాక్షన్ లో కొత్తదనం పెడుతున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, పూర్ణ నటిస్తున్నారు. ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :