“అఖండ” గర్జనకు భారీ రెస్పాన్స్.!

Published on Apr 14, 2021 9:00 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా సెన్సేషనల్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ముందు “సింహా”, “లెజెండ్” లాంటి భారీ హిట్స్ ఉండడంతో వీరి హ్యాట్రిక్ సినిమాపై ఎనలేని అంచనాలు నెలకొన్నాయి. మరి ఇన్నాళ్ళుగా ఒక లెవెల్లో ఉన్న అంచనాలు అన్నీ నిన్న రివీల్ చేసిన టైటిల్ అండ్ సరికొత్త టీజర్ తో మరో లెవెల్ కు వెళ్లాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఊహించని మేకోవర్ లో బాలయ్య బోయపాటి మార్క్ డైలాగ్స్ సహా ఆ బ్యాక్గ్రౌండ్ విజువల్స్ ముఖ్యంగా థమన్ అవుట్ స్టాండింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసిన ప్రతీ ఒక్కరికీ ఈ చిత్రం హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ అని కన్ఫర్మ్ అనిపింది. మరి ఊహించకుండానే ఇచ్చిన ఈ సర్ప్రైజ్ కు భారీ రెస్పాన్స్ నే ఇప్పుడు వస్తుంది.

అది ఒక్క అభిమానులు సోషల్ మీడియా నుంచే కాకుండా యూట్యూబ్ లో కూడా అదరగొడుతుంది. అప్పుడు విడుదల చేసిన ఫస్ట్ రోర్ లానే ఇది కూడా గట్టిగా గర్జించింది. దగ్గరదగ్గర 6 మిలియన్ వ్యూస్ ఇంకా 24 గంటలు పూర్తి కాకముందే సాధించి నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. దీనిని బట్టి ఈ చిత్రంపై ఎలాంటి అంచనాలు సెట్టయ్యాయో మనం అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ చిత్రం విడుదల నాటికి ఇంపాక్ట్ ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :