బాలయ్య ‘డిక్టేటర్’ లో శ్రద్ధ దాస్ స్పెషల్ సాంగ్

బాలయ్య ‘డిక్టేటర్’ లో శ్రద్ధ దాస్ స్పెషల్ సాంగ్

Published on Dec 13, 2015 10:56 PM IST

dictatoot
నట సింహం సందమూరి బాలకృష్ణ తన ఇమేజ్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే కథతో ‘డిక్టేటర్’ అనే పవర్ఫుల్ టైటిల్ తో తన 99వ సినిమా చేస్తున్నాడు. టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఇంకా రెండు సాంగ్స్ షూటింగ్ మాత్రమే బాలన్స్ ఉంది. ‘డిక్టేటర్’ సినిమా కోసం తమన్ ఓ సూపర్బ్ ఐటెం సాంగ్ ని కంపోజ్ చేసాడు. ఈ ఐటెం సాంగ్ కోసం ఎవరైతే బాగుంటారా అని వెతికి ఫైనల్ గా ఈ చిత్ర టీం ఇలియానాని అప్రోచ్ అయ్యారు. మొదట్లో లియానా ఒప్పుకున్నట్టే ఉన్నా ఫైనల్ గా తప్పుకుంది.

ఆ తర్వాత నయనతార ఆ స్పెషల్ సాంగ్ చేయనుందని వార్తలు వచ్చాయి. కానీ శ్రీవాస్ ఆ వార్తలని కొట్టి పారేస్తూ నయనతార ఆ సాంగ్ చేయడం లేదని తెలిపాడు. ఇంతకీ ఆ స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ ఎవరికీ దక్కిందా అనే విషయం తెలుసుకోగా హాట్ బ్యూటీ శ్రద్ధ దాస్ కి ఆ అవకాశం దక్కిందని సమాచారం. ఫైనల్ గా బాలయ్యకి జోడీగా స్పెషల్ సాంగ్ లో కనిపించే చాన్స్ శ్రద్ధ దాస్ కొట్టేసింది.

బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి కోన వెంకట్ – గోపి మోహన్ కలిసి కథని అందించారు. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ సాంగ్ కి సూపర్బ్స్ రెస్పాన్స్ వచ్చింది. శ్రీవాస్ – ఎరోస్ ఇంటర్నేషనల్ వారు కలిసి నిర్మిస్తున్నారు. తమన్ అందించిన మ్యూజిక్ ని డిసెంబర్ 20న రిలీజ్ చేయనున్నాడు.

తాజా వార్తలు