21నుంచి ఆర్.ఎఫ్.సిలో బాలకృష్ణ – త్రిషల సందడి

21నుంచి ఆర్.ఎఫ్.సిలో బాలకృష్ణ – త్రిషల సందడి

Published on Aug 7, 2014 10:04 AM IST

balakrishna
నందమూరి బాలకృష్ణ కొత్త డైరెక్టర్ సత్యదేవ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్ ప్రారంభమైంది. ప్రస్తుతం హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లో షూటింగ్ జరుగుతోంది. ఈ నెల 21 నుంచి ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీకి షిఫ్ట్ కానుంది. ఈ షెడ్యూల్ లో బాలకృష్ణ – త్రిషలపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు.

‘లెజెండ్’ లోలానే బాలకృష్ణ ఈ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో కూడా ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు. బాలయ్య సరసన సెకండ్ హీరోయిన్ గా రాధిక ఆప్టే ని సెలెక్ట్ చేసే పనిలో ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ఉంది. రాధిక ఆప్టే లెజెండ్ సినిమాలో బాలయ్యకి జోడీగా కనిపించింది. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి రుద్రపాటి రమణారావు నిర్మాత.

తాజా వార్తలు