అదే లొకేషన్ లో బాలయ్య షూటింగ్ !

Published on Mar 6, 2021 7:56 pm IST

నట సింహం బాలయ్య బాబు – బోయపాటి సినిమా తరువాత షెడ్యూల్ ను యాదగిరిగుట్టలో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ ఆల్ రెడీ కొంత షూట్ చేశారు. మళ్ళీ ఈ నెల మూడో వారం నుండి మొదలుకానున్న ఇంటర్వెల్ లో వచ్చే ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్ ను ఇక్కడ షూట్ చేస్తున్నారు. గతంలో మిగిలిపోయిన బ్యాలెన్స్ వర్క్ ను షూట్ చేస్తారట. అన్నట్లు బాలయ్య సినిమాలు గతంలో ఇక్కడ చాలావరకు షూటింగ్ జరుపుకున్నాయి.

సింహ సినిమా కూడా యాదగిరిగుట్టలో షూటింగ్ జరుపుకుంది. మొత్తానికి బాలయ్యకి ఈ పుణ్య క్షేత్రం సెంటిమెంట్ అయింది. ఇక ఇక్కడ తీయబోయే సీన్ విషయానికి వస్తే.. యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో బాలయ్య పాత్ర హోమం చేయిస్తూ ఉండగా విలన్స్ అటాక్ చేస్తారట. ఈ క్రమంలో ఫైట్ జరుగనుంది. ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ సినిమా పై బాలయ్య అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

సంబంధిత సమాచారం :