బాలయ్య 99వ సినిమాకు హీరోయిన్ దొరికింది!

బాలయ్య 99వ సినిమాకు హీరోయిన్ దొరికింది!

Published on Apr 8, 2015 10:57 PM IST

anjali
ఈ మధ్య కాలంలో వరుస హిట్లతో కుర్రహీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. ‘లెజెండ్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాలయ్య నటిస్తోన్న తాజా చిత్రం ‘లయన్’. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య 99వ చిత్రమొకటి సెట్స్‌పైకి వెళ్ళనుంది. బాలీవుడ్‌లో పేరొందిన పెద్ద నిర్మాణ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్ ఈ సినిమాను తెరకెక్కించనుంది. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు శ్రీవాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.

తాజాగా ఈ సినిమాలో అంజలిని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఇంకా ఖరారు చేయలేదు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు కోనవెంకట్, గోపీమోహన్‌లు స్క్రిప్ట్‌ను అందించడం విశేషం. ఇక బాలయ్య తాజా చిత్రం ‘లయన్’ ఇప్పటికే షూటింగ్ చివరి దశలో ఉంది. రేపు (ఏప్రిల్ 9న) లయన్ ఆడియో ఆవిష్కరణ జరగనుంది. సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. లయన్ విడుదల తర్వాత బాలయ్య 99వ చిత్రం పట్టాలెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

తాజా వార్తలు