ఆ సాయంతో గొప్ప మనసు చాటుకున్న బాలయ్య !

Published on Apr 9, 2020 8:17 pm IST

నటసింహం నందమూరి బాలకృష్ణకు సేవాగుణం ఎక్కువ అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అందుకు తగ్గట్లుగానే తన బసవతారకం ఛారిటబుల్ ట్రస్ట్‌ నుండి పేద క్యాన్సర్ రోగులకు బాలయ్య ఉచితంగా వైద్యం చేయిస్తున్నారు. కాగా బాలయ్య తనది గొప్ప మనసు అని మరోసారి చూపించాడు. క్యాన్సర్ బారిన పడ్డ రెండేళ్ల పాపకు హైదరాబాద్‌లోని తన క్యాన్సర్ ఆసుపత్రిలో బాలయ్య ఉంచితంగా చికిత్స చేయించాడు. అయితే క్యాన్సర్ నుండి కోలుకున్న ఆ పాప ఈ రోజు డిశ్చార్జ్ అయింది.

అయితే లాక్ డౌన్ కారణంగా ఆ పాప మరియు ఆ పాప తల్లిదండ్రులు తమ ఊరు హిందూపూర్ కు వెళ్లలేని పరిస్థితి. ఈ విషయం తెలుసుకున్న బాలయ్య తన వ్యక్తిగత కారులో ఆ పాప కుటుంబాన్నివాళ్ళ స్వస్థలానికి పంపించాడు. ఈ సంఘటనతో బాలయ్య తన గొప్ప మనసు చాటుకున్నాడు. ఇలాగే బాలయ్య ఎప్పుడూ అవసరమైన వారికి సాయం చేస్తుంటారు. కరోనా నివారణ కోసం కూడా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం ఏకంగా 1.25 కోట్ల సాయం చేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో బాలకృష్ణ ఫ్యాక్షనిస్ట్ గా నటిస్తున్నాడట. అలాగే సినిమాలో బాలయ్య కొన్ని సీక్వెన్స్ లో అఘోరాగా కూడా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం :

X
More