‘సింహా’, ‘లెజెండ్’ లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత నట సింహం నందమూరి బాలకృష్ణ మరో సారి ద్విపాత్రాభినయంలో చేసిన పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లయన్’. సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని ‘యు/ఏ’ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమా మే 8న గ్రాండ్ గా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ తాజాగా మే 8న విడుదల కావాల్సిన లయన్ సినిమా మరోసారి వాయిదా పడనుంది. మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా మే 8 నుంచి మే 14కి వాయిదా పడింది.
అనుకున్న రిలీజ్ కి మరో నాలుగు రోజులే ఉన్నా ఇంకా థియేటర్స్ ఖరారు చేయకపోవడం, అలాగే ప్రొడక్షన్ హౌస్ వారు రిలీజ్ పై పూర్తి క్లారిటీ ఇవ్వకపోవడం మరియు కొన్ని ఫైనాన్సియల్ ఇబ్బందులు ఉన్నాయనే వార్తలు లయన్ రిలీజ్ వాయిదని మరింత కచ్చితంగా చెబుతున్నాయి. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు. సత్య దేవా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బాలకృష్ణ సరసన త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్స్ గా కనిపించనున్నారు. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి రుద్రపాటి రమణారావు నిర్మాత.


