ఫిక్స్ అయిన బాలకృష్ణ ‘లయన్’ రిలీజ్ డేట్

ఫిక్స్ అయిన బాలకృష్ణ ‘లయన్’ రిలీజ్ డేట్

Published on Apr 29, 2015 11:33 AM IST

lion

‘లెజెండ్’ లాంటి సూపర్ హిట్ అందుకున్న తర్వాత నందమూరి నట సింహం బాలకృష్ణ నుంచి వస్తున్న మరో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లయన్’. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ముందు నుంచీ ఈ సినిమాని మే 1న రిలీజ్ చేయాలని అనుకున్నా పోస్ట్ ప్రొడక్షన్ పనుల వలన ఆ రిలీజ్ డేట్ ని కాన్సల్ చేసారు. తాజాగా ఈ చిత్ర నిర్మాతలు అన్నీ క్లియర్ చేసుకొని మే 8న సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్నీ ప్రొడక్షన్ టీం తెలియజేసింది.

‘లయన్’లో బాలకృష్ణ మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ సినిమాలో గాడ్సే, బోసు పాత్రల్లో బాలకృష్ణ కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ ట్రైలర్ కి, అందులో బాలకృష్ణ చెప్పిన పంచ్ డైలాగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సత్యదేవ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బాలకృష్ణ సరసన త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్స్ గా కనిపించనున్నారు. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి రుద్రపాటి రమణారావు నిర్మాత.

తాజా వార్తలు