రీ రిలీజ్ కి రెడీ అయిన బాలకృష్ణ “నరసింహ నాయుడు”

Published on May 26, 2023 9:07 pm IST

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాలలో నరసింహ నాయుడు ఒకటి. ఈ చిత్రం ను ఇప్పుడు రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల చిత్రాలు రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులను అలరించడం మాత్రమే కాకుండా, మంచి వసూళ్లను కూడా రాబట్టాయి. బాలకృష్ణ నటించిన చెన్న కేశవ రెడ్డి రీ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

ఇప్పుడు బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా నరసింహ నాయుడు చిత్రం ను జూన్ 10 కి రిలీజ్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. వెంకట రమణ ప్రొడక్షన్స్ పై ఎం.వి. మురళి కృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఈ చిత్రం లో సిమ్రాన్, ప్రీతి జింగ్యానీ, ఆశ శైని లు లేడీ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :