బాలయ్య పాట రీమిక్స్ తో బిజీ కానున్న కళ్యాణ్ రామ్

బాలయ్య పాట రీమిక్స్ తో బిజీ కానున్న కళ్యాణ్ రామ్

Published on Nov 12, 2014 5:53 PM IST

Patas
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘పటాస్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ నటించిన ‘రౌడీ ఇన్స్పెక్టర్’ సినిమాలోని ‘అరె ఓ సాంబ’ సాంగ్ ని రీమిక్స్ తెలియజేశాం. అభిమానుల కోసం ఈ సాంగ్ ని సంథింగ్ స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ రీమిక్స్ సాంగ్ షూటింగ్ ని రేపటి నుంచి మొదలు పెట్టనున్నారు. ఈ పాట కోసం ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ 5 రకాల డిఫరెంట్ సెట్స్ ని వేసాడు. రేపటినుంచి 5 రజుల పాటు జరిగే ఈ సాంగ్ కి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయనున్నాడు. నందమూరి అభిమానులకు కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయాలనే ఉద్దేశంతో 22 సంవత్సరాల క్రితం వచ్చిన ‘అరె ఓ సాంబ’ పాటని రీమిక్స్ చేస్తున్నారు. అప్పట్లో బప్పి లహరి కంపోజ్ చేసిన ఈ పాటని ఈ పాత్రని ఇప్పుడు సాయి కార్తీక్ రీమిస్క్ చేస్తున్నాడు.

కళ్యాణ్ రామ్ సరసన శృతి సోది నటిస్తున్న ఈ సినిమాని కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ అయిన నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. డిసెంబర్ లో ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు