రెండో వారంలో కూడ బలంగా కొనసాగుతున్న ‘భరత్ అనే నేను’ !

ఈ నెల 20న విడుదలైన మహేష్ బాబు, కొరటాల శివల ‘భరత్ అనే నేను’ చిత్రం మొదటి వారంలో బ్రహ్మాండమైన కలెక్షన్స్ రాబట్టి రెండో వారంలో కూడ బలంగా కొనసాగుతోంది. పైగా ఆదివారంతో పాటు మే 1 కూడ సెలవు కావడంతో లాంగ్ వీకెండ్ కలిసొచ్చి సినిమాకు మంచి రన్ ఉండనుంది. దీంతో సినిమాకు రెండో వారంలో కూడ భారీ షేర్ రానుంది.

పైగా మహేష్ బాబు విజయవాడ, తిరుపతి ప్రాంతాల్లోని థియేటర్లకు స్వయంగా వెళ్లి సినిమాలు చేస్తుండటంతో సినిమాకు మరింత మైలేజ్ అందనుంది. మహేష్ కెరీర్లోనే భారీ హిట్ గా చెప్పబడుతున్న ఈ సినిమా అమెరికాతో పాటు ఆస్ట్రేలియాలో కూడ రికార్డ్ స్థాయి కలెక్షన్స్ అందుకుంటోంది. మహేష్ ముఖ్యంమత్రిగా నటించిన ఈ చిత్రాన్ని డివివి. దానయ్య నిర్మించారు.

Exit mobile version