సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క తాజా చిత్రం ‘భరత్ అనే నేను’ బాక్సాఫీస్ వద్ద మంచి రన్ కనబరుస్తోంది. విడుదలైన అన్ని ఏరియాల్లోనూ సంతృప్తికరమైన వసూళ్లను రాబడుతున్న ఈ చిత్రం రికార్డుల పరంగా చెప్పుకునే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కూడ రికార్డ్ నెలకొల్పింది. ట్రేడ్ వర్గాల లెక్కల మేరకు ఈ చిత్రం క్రాస్ రోడ్స్ థియేటర్లలో రూ.1 కోటి గ్రాస్ ను వసూలు చేసింది.
ఈ ఘనత సాదించడం మహేష్ బాబుకి కొత్తేమీ కాదు. ఆయన గత చిత్రాలు ‘పోకిరి, శ్రీమంతుడు, మురారి, ఒక్కడు, దూకుడు, అతడు’ చిత్రాలు కోటి గ్రాస్ రికార్డును కొల్లగొట్టగా ఇప్పుడు 13 రోజులకే కోటి మ్యాజికల్ ఫిగర్ ను అందుకుని జాబితాలో ఏడవ చిత్రంగా ‘భరత్ అనే నేను’ నిలిచింది. ఇక ఓవర్సీస్లో 3 మిలియన్లు దాటినా ఈ సినిమా 3.5 మిలియన్ దిశగా వెళుతోంది.


