‘భరత్ అనే నేను’ అమెరికా, ఆస్ట్రేలియా వసూళ్లు !

మహేష్ బాబు యొక్క ‘భరత్ అనే చిత్రం’ తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి విజయాన్ని అందుకుందో ఓవర్సీస్లో కూడ అదే స్థాయి విజయాన్ని అందుకుంది. అమెరికాలో మొదటి రోజే రెండు మిలియన్లను అందుకున్న ఈ సినిమా 9 రోజుల్లోనే 3 మిలియన్ మార్కును తాకింది.

ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు అమెరికాలో మొదటి 10 రోజులకుగాను అనగా గత నెల 30 వరకు ఈ సినిమా 3.19 మిలియన్ల (రూ. 21 కోట్లు) వసూలు చేసి మహేష్ కెరీర్లోనే బెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అలాగే ఆస్ట్రేలియాలో 9 రోజులకుగాను 4.43 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లను (రూ.2.23 కోట్లు) ఆర్జించింది. మొదటి 10 రోజుల్లోనే ఇంత మంచి వసూళ్ళని రాబట్టిన ఈ సినిమా ఫుల్ రన్ ముగిసేనాటికి ఎంత మొత్తాన్ని నమోదు చేస్తుందో చూడాలి.

Exit mobile version