మహేష్ సినిమాపై భారీగా ఖర్చు పెట్టిన నిర్మాతలు !

మహేష్ సినిమాపై భారీగా ఖర్చు పెట్టిన నిర్మాతలు !

Published on Apr 17, 2018 6:08 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటే అది ఖచ్చితంగా భారీ బడ్జెట్ చిత్రమే అయ్యుంటుంది. ఎందుకంటే అభిమానుల, ప్రేక్షకుల అంచనాలను అందుకోవాలంటే సినిమా స్థాయి గొప్పగా ఉండాలి కాబట్టి బడ్జెట్ ఎక్కువగానే కేటాయించాల్సి ఉంటుంది. అందుకే ఆయన తాజా చిత్రం ‘భరత్ అనే నేను’పై కూడ నిర్మాతలు భారీ మొత్తాన్నే ఖర్చు చేశారు.

కేవలం రెండు సెట్లు వేయడానికి రూ.6 కోట్ల రూపాయల్ని వెచ్చించారట. ఆ సెట్లలో ఒకటి కథలోని కీలక సన్నివేశం చోటు చేసుకునే అసెంబ్లీ సెట్. దీనికి రూ.2 కోట్లను ఖర్చు చేసిన నిర్మాతలు ‘వచ్చాడయ్యో సామి’ పాట కోసం వేసిన దేవాలయం సెట్ కు రూ.4 కోట్లు కేటాయించారట.

ఈ రెండూ కూడ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని, పెట్టిన ఖర్చుకు తగ్గట్టే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడ పెద్ద మొత్తంలోనే జరిగిందని నిర్మాత దానయ్య తెలిపారు. రాజకీయ నైపథ్యంలో ఉండబోయే ఈ చిత్రం ఈ నెల 20న విడుదలకానుంది.

తాజా వార్తలు