ఏప్రిల్ నాటికి పూర్తికానున్న ‘భరత్ అనే నేను’ !

ఏప్రిల్ నాటికి పూర్తికానున్న ‘భరత్ అనే నేను’ !

Published on Mar 12, 2018 10:59 AM IST

Bharath Ane Nenu

మహేష్ బాబు, కొరటాల శివల ‘భరత్ అనే నేను’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. రాజు సుందరం పర్యవేక్షణలో కైరా అద్వానీ, మహేష్ బాబులపై పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్ రేపటికి పూర్తికానుంది. ఆ తర్వాత ప్యాచ్ వర్క్ జరిపి మార్చి మూడో వారంలో చివరి షెడ్యూల్ కోసం యూకే వెళ్లనున్నారు టీమ్. ఈ షెడ్యూల్ ఏప్రిల్ మొదటి వారానికి ముగియనుంది. దీంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుందట.

మరోవైపు చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని కూడ శరవేగంగా జరుపుతోంది. మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తుండటం, ఇటీవలే విడుదలైన టీజర్ ఆసక్తికరంగా ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఏప్రిల్ 20న విడుదలకానున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

తాజా వార్తలు