సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమా మంచి కలెక్షన్స్ తో దూసుకెళుతోంది . ఈ సినిమా ఇప్పుడు తమిళ భాషలోకి అనువాదం కానుంది. మహేష్ బాబు ‘స్పైడర్’ సినిమా తో తమిళనాడులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకున్నారు.
ఇప్పటికే విడుదలైన ‘భరత్ అనే నేను’ తెలుగు వెర్షన్ తమిళనాడులో మంచి కలెక్షన్స్ ని రాబడుతోంది. ఒక్క చెన్నై లోనే ఈ సినిమా రూ.1.65 కోట్ల షేర్ ని సాధించి ‘బాహుబలి 2’ రికార్డుని క్రాస్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా తమిళంలో ‘భరత్ యనుమ్ నాన్’ పేరుతో రిలీజ్ కానుంది. ఈ చిత్ర ట్రైలర్ ని ఈ శుక్రవారం రిలీజ్ చేసి చిత్రాన్ని ఈ నెల 25 న విడుదల చేయనున్నారు.


