పీరియాడిక్ చిత్రంతో ఈ సారి హిట్ గ్యారింటీ అట !

పీరియాడిక్ చిత్రంతో ఈ సారి హిట్ గ్యారింటీ అట !

Published on Nov 13, 2018 2:17 AM IST

బాణం’ చిత్రంతో దర్శకుడుగా చెైతన్య దంతులూరి మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ… ఆ తరువాత బసంతి చిత్రంతోనూ తాను టాలెంటెడ్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నే ప్రయత్నం చేసినప్పటికీ.. చెైతన్య దంతులూరి కమర్షల్ గా మాత్రం సక్సెస్ సాధించలేకపోయాడు. ఆ లోటును ఈ సారి ఎలాగైనా తీర్చుకోవాలని.. ఇప్పుడు చెయ్యబోయే సినిమాతో భారీ సక్సెస్ కొట్టాలని చెైతన్య దంతులూరి ఓ పీరియాడిక్ స్టోరీని ఎంచుకున్నాడు.

కాగా, 1971 కాలంలో యుద్ధం నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ చిత్రంలో వైవిధ్యమైన చిత్రాల కథానాయకుడు ‘నారా రోహిత్’ నటించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. సాధ్యమైనంత త్వరలోనే షూట్ కి వెళ్ళనుందని తెలుస్తోంది. ఈ సినిమాతో ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని చెైతన్య దంతులూరి ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మరి ఈ చిత్రం చేస్తున్నారు.

అందుకే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు