పాలిటిక్స్ నుండి తప్పుకున్న ప్రముఖ నిర్మాత !

Published on Apr 5, 2019 9:47 am IST

యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్, బండ్ల గణేష్ రాజకీయాలనుండి తప్పుకున్నారు. 2018 తెలంగాణ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అప్పటినుండి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పనిచేయడంతో ఆయనకు పార్టీ అధికారిక ప్రతినిధి పదవిని కట్టబెట్టింది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో అప్పటినుండి పార్టీ కి దూరంగా వుంటున్నారు గణేష్.

ఇక తాజాగా ఈరోజు ట్విట్టర్ ద్వారా వ్యక్తిగత కారణాలతో రాజకీయాలనుండి తప్పుకుంటున్నాని ఈ అవకాశం కల్పించిన రాహుల్‌ గాంధీ, ఉత‍్తమ్‌ కుమార్‌ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక నుంచి తాను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాదని బండ్ల గణేష్‌ తెలిపారు.

ఇక గబ్బర్ సింగ్ తో బ్లాక్ బ్లాస్టర్ నిర్మాత అనిపించుకున్న గణేష్ ఇటీవలి కాలంలో సినిమాలకు దూరమయ్యారు. ఇక తాజా నిర్ణయంతో మళ్ళీ ఆయన సినిమాల్లో బిజీ అవుతారోలేదో చూడాలి.

సంబంధిత సమాచారం :