‘బ్రదర్ అఫ్ బొమ్మాళి’తో సక్సెస్ అందుకున్న కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో చేస్తున్న సినిమా ‘బందిపోటు’. ఈ సినిమా టాకీ పార్ట్ తో పాటు సాంగ్స్ షూటింగ్ ని కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో పాటలు సంథింగ్ స్పెషల్ గా ఉండాలని రెండు పాటలని మిలాన్ లోని బ్యూటిఫుల్ లోకేషన్స్ లో షూట్ చేసారు. న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో వేడుకని సంక్ర్నతి కానుకగా జనవరి 15న లాంచ్ చేయనున్నారు. ఈ వేడుక జె.ఆర్.సి కన్వేషణ్ హాల్ లో జరగనుంది. నరేష్ ఈ సినిమాలో స్టైలిష్ గా కనిపిస్తూనే ఇంతక ముందు చేయని ఓ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నరేష్ సరసన ఈషా జంటగా నటించిన ఈ సినిమాలో శ్రద్ధా దాస్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. కళ్యాణి కోడూరి సంగీత దర్శకుడు. ఇ.వి.వి. సినిమా పతాకంపై నరేష్ సోదరుడు ఆర్యన్ రాజేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


