
‘బ్రదర్ అఫ్ బొమ్మాళి’తో సక్సెస్ అందుకున్న కామెడీ కింగ్ అల్లరి నరేష్ అప్పుడే తన తదుపరి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో అల్లరి నరేష్ చేసిన సినిమా ‘బందిపోటు’. ఈ సినిమా ఫిబ్రవరి 20న భారీగా రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాకి ‘యు/ఏ’ సర్టిఫికేట్ వచ్చింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ బందిపోటు విడుదలకుసిద్దంగా ఉంది.
దాంతో ఈ చిత్ర టీం భారీ ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్నారు. అల్లరి నరేష్ అతని టీం మునుపెన్నడూ లేని విధంగా రెండు రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాలను సంచరించి సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్ళేలా ప్రమోట్ చేస్తున్నారు. అందులోనూ అందరికీ చేరువయ్యేలా ‘బందిపోటు దండయాత్ర’ అని ఒక ప్రమోషనల్ టూర్ చేస్తున్నారు. నిన్న ఈ చిత్ర టీం వైజాగ్ లోని సిఎమ్ఆర్ షాపింగ్ మాల్లో ఒక ఈవెంట్ నిర్వహించి, టీం అంటా డాన్సులు వేసి సినిమాని ప్రమోట్ చేసారు. అల్లరి నరేష్ – ఆర్యన్ రాజేష్ కలిసి తమ స్వీయ నిర్మాణంలో ఈవివి బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తుండడంతో సినిమా ప్రమోషన్స్ లో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు.
నరేష్ ఈ సినిమాలో స్టైలిష్ గా కనిపిస్తూనే ఇంతక ముందు చేయని ఓ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దొంగలను దోచుకో అనే పాయింట్ ని బేస్ చేసుకొని రానున్న ఈ సినిమాలో నరేష్ సరసన ఈశ జంటగా నటించగా, శ్రద్ధ దాస్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. కళ్యాణి కోడూరి సంగీత దర్శకుడు.

