దొంగల్నే దోచుకునే ఓ ‘బందిపోటు’ గోదావరిలో తన పని మొదలుపెట్టాడు. అల్లరి నరేష్, ఇషా జంటగా మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘బందిపోటు’. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ బుధవారం పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రారంభమయింది. కొవ్వూరు, దొమ్మేరు పరిసర గ్రామాలలో చిత్రీకరణ జరుగుతుంది. ప్రధాన తారాగణంపై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
‘బందిపోటు’లో నరేష్ పాత్ర కొత్తగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. అల్లరి నరేష్ సినిమాలకు, మోహన్ కృష్ణ ఇంద్రగంటి సినిమాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. వీరిద్దరి కలయికలో తెరకెక్కుతున్న సినిమా ఎలా ఉంటుందో అని సినిమా ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. , పూర్తి వినోదాత్మక చిత్రంగా ఈ సినిమా రూపొందుతుంది. ఇ.వి.వి.సినిమా పతాకంపై అల్లరి నరేష్ సోదరుడు ఆర్యన్ రాజేష్ నిర్మిస్తున్నారు. హట్రిక్ మ్యూజికల్ హిట్స్ తర్వాత కళ్యాణి కోడూరి మరోసారి మోహన్ కృష్ణ ఇంద్రగంటి సినిమాకు సంగీతం అందిస్తున్నారు.


