డీసెంట్ ఓపెనింగ్స్ తో ప్రారంభమైన ‘బందిపోటు’

డీసెంట్ ఓపెనింగ్స్ తో ప్రారంభమైన ‘బందిపోటు’

Published on Feb 20, 2015 6:40 PM IST

Bandipotu
అల్లరి నరేష్, ఈష జంటగా నటించిన ‘బందిపోటు’ ఈ శుక్రవారం, ఫిబ్రవరి 20న విడుదలైంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా విమర్శకుల ప్రసంశలు అందుకుంది. రెగ్యులర్ గా అల్లరి నరేష్ నటించే సినిమాలకు భిన్నంగా తెరకెక్కిన ఈ సినిమా, తొలిరోజు డీసెంట్ ఓపెనింగ్స్ సాదించింది. ప్రేక్షకుల నుండి సినిమాకు మంచి స్పందన లభిస్తుందని సమాచారం.

ఇ.వి.వి. సినిమా బ్యానర్ ను పునః ప్రారంభించిన ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ సోదరులు నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. నరేష్ కెరీర్లోనే ‘బందిపోటు’ స్టైలిష్ సినిమా అని చెప్పవచ్చు. విజువల్స్ అద్బుతంగా ఉన్నాయి. కళ్యాణ్ కోడూరి పాటలు పెద్ద హిట్టయ్యాయి. సంపూర్నేష్ బాబు, అవసరాల శ్రీనివాస్, తనికెళ్ళ భరణి, రావు రమేష్, పోసాని కృష్ణమురళిలు ఇతర ప్రధాన పాత్రలలో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు