అల్లరి నరేష్, ఈష జంటగా నటించిన ‘బందిపోటు’ సినిమాకు విమర్శకుల ప్రసంశలతో పాటు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. అయితే, సినిమా నేరేషన్ స్లోగా ఉందనే విమర్శ వచ్చింది. దాంతో, సినిమాను మరింత జనరంజకంగా మలచడం కోసం సినిమాలో 15 నిముషాలు ట్రిమ్ చేశారు. ఈ రోజు నుండి సినిమా నిడివి 2.06 నిముషాలు మాత్రమే ఉంటుంది.
మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా తొలిరోజు డీసెంట్ ఓపెనింగ్స్ సాదించింది. ఇ.వి.వి. సినిమా బ్యానర్ ను పునః ప్రారంభించిన ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ సోదరులు నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. నరేష్ కెరీర్లోనే ‘బందిపోటు’ స్టైలిష్ సినిమా అని చెప్పవచ్చు. విజువల్స్ అద్బుతంగా ఉన్నాయి. కళ్యాణ్ కోడూరి పాటలు పెద్ద హిట్టయ్యాయి. సంపూర్నేష్ బాబు, అవసరాల శ్రీనివాస్, తనికెళ్ళ భరణి, రావు రమేష్, పోసాని కృష్ణమురళిలు ఇతర ప్రధాన పాత్రలలో నటించారు.
