‘టెంపర్’ని బ్లాక్ బస్టర్ చేసే పనిలో బండ్ల గణేష్

‘టెంపర్’ని బ్లాక్ బస్టర్ చేసే పనిలో బండ్ల గణేష్

Published on Jan 7, 2015 12:02 PM IST

Bandla-Ganesh1
టాలీవుడ్ బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ తన టార్గెట్ మొత్తాన్ని తన బ్యానర్ లో రానున్న టెంపర్ పైనే పెట్టాడు. తన బ్యానర్ లో మరో బ్లాక్ బస్టర్ సినిమాగా టెంపర్ ని నిలపాలని ట్రై చేస్తున్నాడు. నిన్న ట్విట్టర్ లోకి వచ్చిన ఆయన ‘ప్రస్తుతం నా లక్ష్యం, నా డ్రీం, నా ఆశయం.. ‘టెంపర్’ సినిమాని బ్లాక్ బస్టర్ చెయ్యడమే అని’ ట్వీట్ చేసాడు. ఈ విషయం ఎన్.టి.ఆర్, పూరి జగన్నాధ్ అభిమానులకి నచ్చడంతో వాళ్ళు కూడా ఆయనలోని కోరికకి పూర్తి సపోర్ట్ ని ఇచ్చారు.

ఇటీవలే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటిస్తున్న ‘టెంపర్’ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయ్యింది. దాంతో అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ హైదరబాద్ లో జరుగుతోంది. ఎన్.టి.ఆర్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ దయగా కనిపించనున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

తాజా వార్తలు